News April 3, 2025

బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

image

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 5, 2025

KMR: 9 నెలల జైలు శిక్ష

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి KMR జిల్లా న్యాయస్థానం 9 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీసుల వివరాల ప్రకారం ముత్త గౌడ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. బోయిన స్వామి అతివేగంగా ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముత్త గౌడ్ మృతి చెందాడు. బిక్కనూర్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఈ మేరకు తుది తీర్పు ఇచ్చారు.

News April 5, 2025

బదనకల్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

ముస్తాబాద్ మండలం బాదనకల్ గ్రామంలోని ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. పాతూరి మల్లమ్మ(54) గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఆమె వ్యాధి నయం కాలేదు. శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

News April 5, 2025

ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!