News April 8, 2025
బోథ్: కత్తుల ప్రదర్శన చేసిన వారిపై కేసు నమోదు

బోథ్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో బహిరంగంగా కత్తుల ప్రదర్శన చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ర్యాలీలో కార్తీక్, రాహుల్, ఆకాష్ అనే వ్యక్తులు బహిరంగంగా ర్యాలీలో కత్తుల ప్రదర్శన చేశారని ఎస్సై వివరించారు. నిబంధన విరుద్ధంగా ర్యాలీలో మరణ ఆయుధాలు ప్రదర్శించిన వారిపై సోమవారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు
Similar News
News April 17, 2025
ఈనెల 18న ADBకు మంత్రి పొంగులేటి రాక

భోరజ్ మండలం పూసాయిలో ఈనెల 18న ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మంత్రిచే ప్రారంభించే సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News April 17, 2025
ADB: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు ADB జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 16, 2025
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: ADB DEO

యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.