News March 1, 2025

బోధన్: సాగునీటి సమస్య తలెత్తితే అధికారులదే బాధ్యత: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు.

Similar News

News March 2, 2025

NZB: రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా బృందం ఖరారు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సైక్లిస్టు బృందం ఖరారైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో జిల్లా స్థాయిలో వివిధ వయోపరిమితిలో ఎంపికల ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన జిల్లా బృందం ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News March 2, 2025

NZB: వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్నును ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు నూరు శాతం వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేవించారు.

News March 2, 2025

NZB: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు: పీసీసీ చీఫ్

image

కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలలో మాట్లాడేటప్పుడు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్సెండ్ చేయడంపై ఆయన మాట్లాడుతూ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని తెలిపారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని వివరించారు.

error: Content is protected !!