News January 1, 2025

బోయకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బోయకొండలో గుర్తు తెలియని వాహనం ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. చౌడేపల్లె మండలం, బోయకొండ అప్పినేపల్లికి చెందిన ఎన్ రాజన్న(50) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సొంత పనిపై బుధవారం వేకువజామున పక్షిరాజపురానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత ఉండగా పిల్లలులేరు. కేసు దర్యాప్తులో ఉందని SI తెలిపారు.

Similar News

News January 6, 2025

తిరుపతి: సంక్రాంతి ట్రైన్లు.. 8గంటలకు బుకింగ్

image

➥ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➥ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➥చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➥ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➥ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

News January 6, 2025

తిరుపతి: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి

image

కాలినడకన వస్తున్న భక్తులను 108 అంబులెన్స్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి నడుచుకొస్తున్న భక్తులు తిరుపతి వైపుగా వెళుతుండగా వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

News January 6, 2025

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.