News February 12, 2025

బోయిన్పల్లి: మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ

image

బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్ఎండికి 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంట పొలాలకు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

జగన్ మద్యంతో ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్: మంత్రి రవీంద్ర

image

AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యేగా సభకు రావొచ్చని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైందని విమర్శించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

News February 12, 2025

కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.

error: Content is protected !!