News November 15, 2024
బోరుగడ్డ అనిల్ వివాదం.. మరోసారి పోలీసులు సస్పెండ్
గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ అరండల్ పేట పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అనిల్ మేనల్లుడిని లోనికి అనుమతించారు. ఈ అంశంలో హెడ్ కానిస్టేబుళ్లతో పాటూ ఒక కానిస్టేబుల్ ప్రమేయం ఉండటంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News November 15, 2024
రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై సబ్ కమిటీ
రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం సబ్ కమిటీ నియమించింది. గతంలో పలు సంస్థలకు చేసిన భూకేటాయింపులు పరిశీలన, కొత్తగా సంస్థలకు కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం కమిటీ చర్చించనుంది. సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యా రాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. ఈ కమిటీని నేడు వెలగపూడి సచివాలయంలో భేటీ కానుంది.
News November 15, 2024
నటుడు పోసాని కృష్ణ మురళీపై కేసు నమోదు
నటుడు పోసాని కృష్ణ మురళీపై పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోసానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ హైమారావు తెలిపారు. బాపట్లలోనూ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పలు స్టేషన్లలోనూ పోసానిపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
News November 14, 2024
విడదల రజినీ, డైమండ్ బాబుకి కీలక బాధ్యతలు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.