News April 1, 2025

బ్రహ్మంగారిమఠంలో ఇరువర్గాల దాడి

image

బ్రహ్మంగారిమఠం గ్రామంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. భూతగాదాతో ఘర్షణ జరిగింది. మల్లికార్జున్ రెడ్డి, జయరాం రెడ్డి, అతని తండ్రిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News April 5, 2025

కడప: నేడు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

image

కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 5, 2025

కడప: ‘సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి’

image

కడప జిల్లా పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఇతర కేటగిరి నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందడానికి సీనియార్టీ జాబితాను రూపొందించినట్లు DEO షేక్ శంషుద్దీన్ తెలిపారు. సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాత పూర్వకంగా ఆధారాలతో సంప్రదించాలని సూచించారు.  

News April 5, 2025

కడప: ‘ఈ శ్రమ్ పోర్టల్ నందు కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

కడప జిల్లా పరిధిలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమ పేర్లు ఈ శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి అని ఉప కమిషనర్ శ్రీకాంత్ నాయక్ పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొనుటకు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు.

error: Content is protected !!