News March 21, 2025
బ్రాహ్మణుడు లేని ఆదర్శ వివాహాలు జరగాలి: యాదగిరి

సమాజంలో ఆదర్శ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు మరిన్ని జరగాలని పాశం యాదగిరి, పలవురు వక్తలు అభిప్రాయపడ్డారు. SVKలో నాగర్‌కర్నూల్‌కు చెందిన వెంకటేశ్ (ఎస్సీ) మంచిర్యాలకు చెందిన హారిక (ఎస్టీ) ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షతన బ్రాహ్మణుడు, మంత్రాలులేని ఆదర్శ వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట పాడి అలరించారు.
Similar News
News March 31, 2025
KKRకు షాక్.. 25కే 3 వికెట్లు

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. డికాక్ 1, నరైన్ 0, కెప్టెన్ రహానే 11 పరుగులకు ఔటయ్యారు. బౌల్ట్, దీపక్, అశ్వినీ కుమార్ తలో వికెట్ తీశారు.
News March 31, 2025
మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.
News March 31, 2025
KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్‌లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.