News February 1, 2025
బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయండి: కలెక్టర్
ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారుల మీద బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తరచు వాహనాలు తనిఖీలు చేపట్టి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్.. అనంతకు వరాలు కురిపించేనా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, జిల్లా పరిధిలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రకటన, పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న బెల్ కంపెనీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజలు ఎదరుచూస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీకి నిధులు పెరిగితే జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.
News January 31, 2025
ఫిబ్రవరి 5న అనంత హార్టికల్చర్ కాంక్లేవ్: కలెక్టర్
ఫిబ్రవరి 5న ‘అనంత హార్టికల్చర్ కాంక్లేవ్’ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఇందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తామన్నారు.
News January 31, 2025
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంత ఎమ్మెల్యే
అనంతపురంలోని కొత్తూరు, పాతూరు అమ్మవారి శాలల్లో వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం వాసవీమాతకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.