News March 28, 2025

బ్లాక్ స్పాట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్, ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో 37 బ్లాక్ స్పాట్లను గుర్తించగా.. ఆయా బ్లాక్ స్పాట్లలో రెండు వారాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల రోడ్డు భద్రతలో భాగంగా వితౌట్ హెల్మెట్‌తో ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 2, 2025

అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

image

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

అనంత: హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

image

నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన సిద్దయ్యకు జీవిత ఖైదీ విధిస్తూ అనంతపురం నాలుగవ ఏడీజే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అనంతపురం 4 రోడ్డుకు చెందిన రామాంజినమ్మ ఫిబ్రవరి 2014న మిస్సింగ్‌పై భర్త రవి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దయ్య ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ జగదీష్ అభినందించారు.

News April 2, 2025

రెండో విడత రీ-సర్వే పనులు పూర్తికి కృషి: కలెక్టర్

image

విజయవాడ సీసీఎల్ కార్యాలయం నుంచి బుధవారం రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్ రీ సర్వే ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఫ్రీ హోల్డ్ రెండో విడత రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!