News October 27, 2024
భక్తులతో కళకళలాడుతున్న మహానంది ఆలయం
ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆదివారం రోజు కావడంతో భక్తులతో సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేకువజామున స్వామి, అమ్మవారికి స్థానిక అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతులు చేపట్టారు.
Similar News
News January 3, 2025
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు షేక్ ఆఫ్రిది
ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు గుజరాత్లో జరగనున్న 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోయే ఏపీ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు షేక్ అఫ్రీద్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు నీలిమ, కార్యదర్శి భానుప్రసాద్ తెలిపారు. షేక్ ఆఫ్రిది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచాడని పేర్కొన్నారు.
News January 3, 2025
ఉప వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సభ్యుడు సమావేశం
షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ పీ.రంజిత్ భాషా హాజరయ్యారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతిపత్రాలను రాజీవ్ రంజాన్ మిశ్రా స్వీకరించారు.
News January 2, 2025
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం: కలెక్టర్
2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య, డీఆర్వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.