News April 14, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

భద్రకాళి అమ్మవారు సోమవారం సందర్భంగా భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమంలో అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందేందుకు భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.
Similar News
News April 18, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో NCLలో 200 ఉద్యోగాలు

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 200 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్‌తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైనవారు అర్హులు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. OBC/EWS/UR అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రూ.1,180(మిగతా కేటగిరీలకు మినహాయింపు). CBT ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <
News April 18, 2025
BRS నేతలతో కేసీఆర్ సమావేశం

TG: బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News April 18, 2025
జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నారా?

కొందరు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు తినేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్‌లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. అలాగే డెయిరీ పదార్థాలు, గుడ్లు ఎక్కువగా తిన్నా జంక్ ఫుడ్‌పైకి మనసు వెళ్లదు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినాలనే కోరికలు నియంత్రణలో ఉంటాయి.