News March 15, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.
Similar News
News March 15, 2025
కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తులు

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ మొక్కులు లక్ష్మీ నరసింహ స్వామికి చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలా వసతులు కల్పించామని ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.
News March 15, 2025
చెన్నారావుపేట: ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభం

చెన్నారావుపేట మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ద్వారా బోధనను కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభించారు. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామన్నారు.
News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.