News February 25, 2025
భద్రాచలం: MURDER అటెంప్ట్.. జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో నిందితుడికి భద్రాచలం కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్ కాలనీకి చెందిన వినోద్, దుమ్ముగూడెంకు చెందిన జెట్టి చరణ్ పై ఫిర్యాదు చేయగా భద్రాచలం టౌన్ ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జిషీట్ వేసి విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన న్యాయమూర్తి శివనాయక్ సోమవారం తీర్పును వెల్లడించారు.
Similar News
News February 25, 2025
పరిగిలో రోడ్డు ప్రమాదం (UPDATE)

పరిగి శివారులోని HYD బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు బైకులను కంటైనర్ లారీ ఢీకొనగా ఓ బైక్‌పై ఉన్న శ్రీశైలం (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలానికి చెందిన రంగంపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా ఎస్‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు. మరో బైక్‌పై ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామన్నారు.
News February 25, 2025
గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
News February 25, 2025
పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

AP: ఎలక్ట్రానిక్ చిప్‌లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.