News April 1, 2025
భద్రాచలం: ట్రైబల్ మ్యూజియం పట్ల కలెక్టర్ సంతృప్తి

ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా నేటి తరానికి అందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియాన్ని పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి సందర్శించారు. మ్యూజియంలో గిరిజన సంస్కృతిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళాఖండాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News April 3, 2025
రికార్డుస్థాయి వర్షపాతం

TG: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో సరూర్ నగర్, హిమాయత్ నగర్‌లో 84.8mm, చార్మినార్ 84mm, ముషీరాబాద్‌లో 80.5mm వర్షపాతం నమోదైంది. దాదాపు అన్నిచోట్ల 66mm పైనే వాన కురిసింది. ఏప్రిల్‌లో ఈస్థాయి వర్షం పడటం ఇదే తొలిసారని తెలుస్తోంది. కాగా అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News April 3, 2025
బ్యాంకు ప్రతినిధులతో విశాఖ కలెక్టర్ సమావేశం

స్వయం ఉపాధి పొందాలనుకునే అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పలువురు బ్యాంకు ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం అయ్యారు. రుణాల మంజూరులో సులభతర విధానాలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి తగిన విధంగా అండగా నిలవాలన్నారు.
News April 3, 2025
వికారాబాద్: ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పదోన్నతులు పోందిన వికారాబాద్ జిల్లాకు చెందిన తెలుగు, హింది, LFL HMలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేసింది. తెలుగు వారికి ఆలంపల్లి పాఠశాలలో,హింది వారికి బాలుర ఉన్నత పాఠశాలలో, LFL HMకు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని DEO రేణుకదేవి తెలిపారు.