News April 6, 2025
భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.
Similar News
News April 12, 2025
ఖమ్మంలో భానుడి ఉగ్రరూపం.. 41.1 డిగ్రీలు నమోదు

ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా ఖమ్మం (రూ) పల్లెగూడెంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నేలకొండపల్లి, ఖమ్మం(U) ఖానాపురం PSలో 41.0, మధిర, ముదిగొండ, చింతకాని 40.9, రఘునాథపాలెంలో 40.7, వైరా, కొణిజర్లలో 40.3, లింగాల (కామేపల్లి), కాకరవాయి (తిరుమలాయపాలెం) 40.0, తల్లాడలో 39.7, సత్తుపల్లిలో 38.7, ఏన్కూరులో 38.6 నమోదైంది.
News April 12, 2025
KMM: ‘నిరుద్యోగ యువకులు 25లోగా అప్లై చేసుకోండి’

2025-26 నియామక సంవత్సరానికి అగ్నివీర్ ఎంపిక పరీక్ష కోసం జిల్లాలోని నిరుద్యోగ అవివాహిత యువకులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు www.joinindianarmy.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-27740205కు సంప్రదించాలని పేర్కొన్నారు.
News April 12, 2025
రైతన్నలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి: ఖమ్మం కలెక్టర్

రైతన్నలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, చెడు అలవాట్లను మానుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ (మం) కాచిరాజుగూడెంలో ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతుల కోసం మాత్రమే ఉందని, రైతుల కష్టాలను తొలగింపుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.