News March 22, 2025
భద్రాచలం పంచాయతీ ఆదాయం రూ.1.25 కోట్లు

భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం వేలం పాట నిర్వహించగా ఆశీలు రూ.1.25కోట్లకు రంగా అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. గోదావరి నదిలో బోట్లకి రూ.27.25 లక్షలు, చర్ల రోడ్డులో వారసంతకు రూ.3.80లక్షలు, మరో మూడు దుకాణాలకు 3.67లక్షలు పలికాయి. కాగా మరోసారి ఆశీలు టెండర్ దక్కించుకునేందుకు పాత గుత్తేదారు రూ.1.23 కోట్ల వరకు పాట పాడారు. వీటి ద్వారా ఏడాది జీపీకి అదనపు ఆదాయం రానుంది.
Similar News
News March 25, 2025
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

వాట్సాప్‌లో త్వరలో ‘Spotify Music-status updates’ ఫీచర్ రానుంది. దీని సాయంతో యూజర్లు Spotify మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ నుంచి తమకు ఇష్టమైన పాటలను వాట్సాప్ స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర యూజర్లు కూడా ఆ స్టేటస్‌పై సింగల్ ట్యాప్‌తో Spotifyలో ఆ సాంగ్‌ను వినేందుకు వీలుంటుంది. యాప్‌లో స్టేటస్ ఆప్షన్ వద్దే నేరుగా మ్యూజిక్ యాడ్ చేసేలా ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
News March 25, 2025
శ్రీకాకుళం: అనుమానంతోనే హత్యలు

నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.
News March 25, 2025
GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.