News March 11, 2025
భద్రాచలం: పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇద్దరికి రిమాండ్

భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ ఛాంబర్ ఎదుట ఈనెల 4న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర వ్యక్తులను ఆరా తీయడం ద్వారా పట్టణానికి చెందిన భాను, నరేశ్‌లే ఈ చర్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 11, 2025
భీమవరం: ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ప.గో. జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య వివరాలు వెల్లడించారు. నలుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువగల 54 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్‌టాప్స్, నెట్వర్కింగ్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారు.
News March 11, 2025
VZM: ఆదర్శ దివ్యాంగ జంటలకు అభినందన

ఆదర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంటలను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసమూర్తి సోమవారం ఆశీర్వదించారు. విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ సంస్థ సమక్షంలో రెండు విభిన్న ప్రతిభావంతుల జంటలకు వివాహం చేశాయి. జిల్లాకు చెందిన నారాయణ, శ్రీసత్య అలాగే సత్య ఆచారి, విజయలక్ష్మి ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటలను శ్రీనివాస్ మూర్తి అభినందించారు.
News March 11, 2025
థాంక్యూ సీఎం సర్ : బీద రవిచంద్ర

శాసనమండలి సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బీద రవిచంద్ర యాదవ్ ధన్యవాదములు తెలియజేశారు. సోమవారం అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం చంద్రబాబు నాయుడుతో రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రవిచంద్రకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.