News March 26, 2025
భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Similar News
News April 2, 2025
ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.
News April 2, 2025
ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.
News April 2, 2025
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు

TG: ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.