News March 13, 2025
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Similar News
News March 13, 2025
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
News March 13, 2025
శ్రీ సత్యసాయి: 15న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వచ్ఛ ఆంధ్ర, హరితాంద్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.
News March 13, 2025
పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.