News March 28, 2025
భద్రాచలంకు రూ.35 కోట్లు.. సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
TODAY HEADLINES

✒ రేపు లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు
✒ కర్ణాటకలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 పెంపు
✒ ఈ నెలలోనే మెగా DSC నోటిఫికేషన్: CBN
✒ జూన్ 12 లోపు తల్లికి వందనం: అచ్చెన్న
✒ మే నెల నుంచి కొత్త రేషన్‌కార్డులు: నాదెండ్ల
✒ కాకాణికి ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
✒ HCU భూమిని న్యాయంగానే తీసుకుంటున్నాం: భట్టి
✒ ఆ భూములు అటవీ శాఖ పరిధిలోనివి: బండి సంజయ్
✒ రైతులకు కన్నీళ్లే మిగిలాయి: KCR
News April 2, 2025
కాలేజీల అనుమతికి హైపవర్ కమిటీ

AP: మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీల అనుమతికి ఇచ్చే ఈసీ జారీకి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, స్విమ్స్ డైరెక్టర్, వైద్యవిద్య డైరెక్టర్‌తో ఈ కమిటీ ఉండనుంది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీ పనిచేయనుంది.
News April 2, 2025
తిరుతి జిల్లాలో ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో 164 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 26,967 మందికి 26, 615 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్ విద్యార్థులు 127 మందికి గాను 41 మంది రాకపోవడంతో 86 మంది పరీక్షలు రాశారని డీఈవో కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశారు.