News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

Similar News

News March 31, 2025

రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా?.. క్లారిటీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆప్షనల్ <<15946388>>హాలిడే<<>> ఇవ్వడంతో రేపు జరగాల్సిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై క్లారిటీ కోసం Way2News విద్యాశాఖ అధికారులను సంప్రదించింది. ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని, రేపు యథావిధిగా ఎగ్జామ్ ఉంటుందని వారు స్పష్టం చేశారు.

News March 31, 2025

యాలాల్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం..  

image

 యాలాల్ మండలం యోన్కెపల్లిలో  8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. గమనించిన స్థానికులు దుండగుడిని నిలదీశారు. అనంతంరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దుండగుడు కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News March 31, 2025

ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు 

image

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్‌ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!