News February 28, 2025
భద్రాద్రి: ఇసుక రవాణా.. ప్రాణం బలితీసుకుంది!

అక్రమ ఇసుక రవాణా వల్ల ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోవడమే కాక, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గుంపెనగుడెంలో ఇసుక ట్రాక్టర్లు తోలుతుండగా, గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై ఇసుక ట్రాక్టర్ వెళ్లడంతో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు మరణించారని, శ్యామలచెన్ను అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.
Similar News
News February 28, 2025
పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 28, 2025
సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి

కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేణి సోని అనే గర్భిణీ మృతిచెందింది. చికిత్స కోసం ఆమె హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సోని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

ఆదిలాబాద్‌లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.