News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News April 9, 2025
ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
News April 9, 2025
కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
News April 9, 2025
సిరిసిల్ల: ఆయుధ కారాగారాన్ని ప్రారంభించిన అడిషనల్ డీజీపీ

సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులో 17th బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన ఆయుధ కారాగారాన్ని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజేషన్ అని తెలిపారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.