News April 6, 2025
భద్రాద్రి జిల్లాకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు చెప్పారు. అన్ని సహజ వనరులు మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు అందచేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 9, 2025
ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని ఎచ్చెర్ల ఎస్.ఐ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరుకూరి తిరుపతమ్మ (21), బేపల అనూష (18) లు ఎచ్చెర్లలోని శక్తి సదన్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం సమయం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ నెంబర్ 63099 90816కు సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు.
News April 9, 2025
చిత్తూరు: యువతి ప్రేమ నిరాకరించిందని..!

ఓ యువకుడు తన వాహనానికే నిప్పు పెట్టుకున్న ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. గిరి అనే యువకుడు పూజాగానిపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించిదన్న కోపంతో గిరి ఆమె ఇంటి ముందు మంగళవారం తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News April 9, 2025
సైబర్ సేఫ్ జిల్లాగా నంద్యాల: SP

నంద్యాల జిల్లాను సైబర్ సేఫ్ జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరని స్పష్టం చేశారు. మహిళలు ఆన్‌లైన్ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరిట విదేశీ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత వాట్సప్ సందేశాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.