News April 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ మణుగూరు సీఐ, రిపోర్టర్✓ఉపఎన్నిక వస్తే భద్రాచలంలో గులాబీ జెండా ఎగురుతుంది: ఎమ్మెల్సీ కవిత ✓బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి ✓మణుగూరులో ఆటో బోల్తా.. స్వల్ప గాయాలు ✓ఆపరేషన్ థియేటర్లో ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే ✓ములకలపల్లిలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన డీపీఓ

Similar News

News April 22, 2025

గిల్-సాయి జోడీ అదుర్స్

image

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.

News April 22, 2025

లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

News April 22, 2025

సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

image

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

error: Content is protected !!