News January 24, 2025

భద్రాద్రి: నిత్యాన్నదానానికి రూ.100,116 విరాళం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గురువారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎన్సీహెచ్. కృష్ణమాచార్యులు-రమాదేవి దంపతులు స్వామివారి అన్నదానం నిమిత్తం రూ.100,116 లను ఆలయ ఈవో రమాదేవికి విరాళంగా అందజేశారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

image

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.

News January 24, 2025

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన DSP 

image

ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టులో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ DSP కె. శివరాంరెడ్డి నార్కట్‌పల్లి సీఐ నాగరాజుతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.  దేవాలయ EO నవీన్ కుమార్ నార్కెట్ పల్లి పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

News January 24, 2025

అంతర్గాం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

image

అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలో నిన్న పెసరి సత్తమ్మ కిరాణ షాపు వద్ద ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న SI వెంకటస్వామి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈరోజు ఇద్దరు నిందితులను ఎల్లంపల్లి డ్యాం వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.