News March 21, 2025

భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

image

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 31, 2025

గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

image

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.

News March 31, 2025

గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

News March 31, 2025

కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 2నుంచి ఉచిత కోచింగ్

image

జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. ఆలమూరు, కొత్తపేట, కాట్రేనికోన, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో కోచింగ్ ఇస్తామని జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు సోమవారం తెలిపారు. పాలిటెక్నిక్, APRJC, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్‌పై పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

error: Content is protected !!