News March 19, 2025

భద్రాద్రి: మైనర్‌పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

image

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.

Similar News

News March 19, 2025

‘RRR’లో మెయిన్ హీరో ఇతడే.. ‘GROK’ ద్వంద్వ వైఖరి!

image

సినిమాల విషయంలో ‘GROK’ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఫ్యాన్ వార్స్ సృష్టిస్తోంది. తాజాగా ‘RRR’ సినిమాలో మెయిన్ హీరో కొమురం భీమ్ క్యారెక్టర్‌లో నటించిన ఎన్టీఆర్ అని చెప్తోంది. గోండు జాతికి చెందిన భీమ్ బ్రిటిష్ వారి నుంచి మల్లిని కాపాడాడని ఉదహరిస్తోంది. రామ్ చరణ్‌ది కీలక పాత్ర అని చెప్తూనే.. మరికొందరికి ఇతనే మెయిన్ హీరో అని రిప్లై ఇస్తోంది. దీంతో ఫ్యాన్స్ మధ్య గందరగోళం నెలకొంది. మీ కామెంట్?

News March 19, 2025

బిల్‌గేట్స్‌ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

image

AP: బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాల అనంతరం సీఎం చంద్రబాబు బిల్‌గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చెప్పారు. మరోవైపు, ఈ ఉదయం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో CBN భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం చంద్రబాబు విజయవాడకు తిరుగుపయనం అయ్యారు.

News March 19, 2025

MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

image

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS

error: Content is protected !!