News February 3, 2025
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఆసక్తికర ఘటన
భద్రాద్రి రామాలయంలో వాగ్గేయకార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ముస్లిం తండ్రి కోడుకులు కచేరి నిర్వహించారు. వరంగల్‌కి చెందిన మహ్మద్ లాయక్ ఆహ్మద్, కోడుకు మహ్మద్ షహబాజ్ తమ సంగీత కచేరితో భక్తులను ఆకట్టుకున్నారు. మతసామరస్యం చాటిన వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.
Similar News
News February 3, 2025
తూ.గో: సోలార్ విద్యుత్ యూనిట్స్ స్థాపనకు కృషి చేయాలి- కలెక్టర్
సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్స్ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ ట్రాన్స్కో క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ ఏర్పాటు చేయడం పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
News February 3, 2025
నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 3, 2025
సంగారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.