News March 15, 2025

భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

image

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.

Similar News

News March 16, 2025

చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 16, 2025

విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

image

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆమె జీతం గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె జీతం, ఆహారం, బస ఖర్చులను నాసానే భరిస్తుంది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్పేస్‌లో అదనంగా ఉంటే రోజుకు రూ.347 (4 డాలర్లు) మాత్రమే ఇస్తుందని సమాచారం.

error: Content is protected !!