News March 10, 2025

భద్రాద్రికొత్తగూడెం: రైల్వే బోర్డు ఛైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ

image

జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఆయన రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్త ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు కొత్త రైళ్ల మంజూరుపై మాట్లాడారు. 

Similar News

News March 11, 2025

మందమర్రి: యాక్సిడెంట్.. నేరస్థుడికి జైలు శిక్ష

image

యాక్సిడెంట్ కేసులో నేరస్థుడికి 18నెలల జైలు, రూ.8వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జ్యుడీషియల్ జడ్జి విధించినట్లు SIరాజశేఖర్ తెలిపారు. SI కథనం ప్రకారం.. 2016లో మందమర్రి కానిస్టేబుల్‌ శ్రీధర్ బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసులో సాక్షులను విచారించిన జడ్జి నిందితుడు లారీ డ్రైవర్ సుధాకర్ రెడ్డికి జైలు శిక్ష విధించారు.

News March 11, 2025

ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

image

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.

News March 11, 2025

బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రి కుర్రాడి విజయం

image

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రికి చెందిన అక్షయ్ విజేతగా నిలిచారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అక్షయ్ 70 విభాగంలో తన ప్రతిభ చాటి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పట్టణవాసులు పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!