News April 6, 2025
భద్రాద్రిలో ముగిసిన CM రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తాళ్ల గుమ్మూరు గ్రామంలో గిరిజన కుటుంబంలో భోజనాలు చేసిన అనంతరం బీపీఎల్‌లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాదుకు బయలుదేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర శాఖల అధికారులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News April 17, 2025
రాజీవ్ యువ వికాసం.. రెండు దశల్లో డబ్బులు

TG: రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
News April 17, 2025
వ్యభిచారం.. బాపట్ల మహిళల అరెస్ట్

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్‌మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
News April 17, 2025
అమెరికాలో తిరుపతి వాసికి మంత్రి పదవి

అగ్రరాజ్యం అమెరికాలో తిరుపతి జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్‌సిన్ స్టేట్‌లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్‌గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.