News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News April 2, 2025
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.
News April 2, 2025
బర్డ్ ఫ్లూ అలర్ట్.. ఉడికించిన మాంసమే తినాలి!

AP: నరసరావుపేట బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పచ్చిమాంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమాంసంలోని సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియా చాలా డేంజర్. అందుకే చికెన్‌తో పాటు గుడ్లను 100 డిగ్రీలకు పైగా ఉడికించి తినాలి. జబ్బుపడిన పెంపుడు జంతువులు, పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్రస్థాయిలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News April 2, 2025
వెంకటాపూర్: పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు

పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి ముగ్గుపోసి క్షుద్రపూజలు చేసినట్లు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూజలపై స్థానికులు ఆరా తీస్తున్నారు.