News April 3, 2025
భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
Similar News
News April 11, 2025
నేడే జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొండా

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్‌లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.
News April 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 11, 2025
ఏప్రిల్ 11: చరిత్రలో ఈరోజు

1827: సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జననం (ఎడమ ఫొటో)
1869: కస్తూరిబాయి గాంధీ జననం (కుడి ఫొటో)
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పాటు
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైలా వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం * జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం