News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొడ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
News December 30, 2025
కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.
News December 30, 2025
REWIND: సైబర్ క్రైమ్‌లో 205 మంది అరెస్ట్.. విశాఖ సీపీ

విశాఖలో 2025లో సైబర్ క్రైమ్ సంబంధించి 205 మందిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. వీరి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. వార్షిక సమావేశం ముగింపులో ఆయన మాట్లాడారు. విశాఖలో నేర, శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.


