News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో భువనగిరి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
News February 8, 2025
నిజామాబాద్: రేటు రాక పసుపు రైతుల్లో ఆందోళన
నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News February 8, 2025
AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?
2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.