News February 2, 2025

భారత జట్టుకు అభినందనలు: హోం మంత్రి అనిత

image

రెండవ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ అండర్-19 జట్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష మూడు వికెట్లు తీసి 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బౌలింగ్‌లో విశాఖకు చెందిన షబ్నం ఒక వికెట్ తీయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

Similar News

News February 2, 2025

జనగామ: రేపటి ప్రజావాణి రద్దు

image

జనగామ కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.

News February 2, 2025

భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.

News February 2, 2025

బాలానగర్‌: గ్రామంలో మద్యం అమ్మితే రూ.50వేల జరిమానా

image

బాలానగర్ మండలం నేరళ్ళపల్లిలో గ్రామంలో మద్యం అమ్మకాలపై గ్రామస్థులు నిషేధం విధించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామంలో మద్యపానం నిషేధం విధించామని, మద్యం అమ్మితే రూ.50 వేలు, తాగిన వారికి రూ.30 వేలు జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. మద్యం అమ్మినట్లు పట్టుకుంటే రూ.10 వేలు నజరానా అందజేస్తామన్నారు. మధ్యపాన నిషేధానికి గ్రామస్థులు సహకరించాలన్నారు.