News March 6, 2025
భారతి హత్య కేసులో తండ్రి, మరొకరి అరెస్ట్

గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
Similar News
News March 7, 2025
నెమలి వాహనంపై విహరించిన చంద్రమౌళీశ్వరుడు

ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
News March 6, 2025
అనంత: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పూల శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా కదిరి నియోజవర్గం తలుపుల మండలానికి చెందిన పూల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News March 6, 2025
జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారీగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.