News March 25, 2025

భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 29, 2025

వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.

News March 29, 2025

దుగ్గొండి: ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

image

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవళిక(27) శుక్రవారం ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రవళికకు భర్త సుధాకర్, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2025

వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పర్వతగిరి మండలానికి చెందిన వెంకన్న అప్పుల బాధతో వరంగల్ ఓ సిటీ మైదానంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్టర్ పోలీసులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!