News March 7, 2025

భీమదేవరపల్లి: న్యాయం కోసం CM వద్దకు పాదయాత్ర

image

భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం కొడుకు రాజేష్ 2018లో ఓ పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ మృతిచెందాడు. విష ప్రయోగంతో చనిపోయాడని, నిందితులను శిక్షించి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా దశరథం దంపతులు వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు. గురువారం ‘న్యాయం కోసం ముఖ్యమంత్రి’ వద్దకు బ్యానరుతో బయలు దేరారు. రాంనగర్ వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు.

Similar News

News March 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాకు 35 మంది ఎస్ఐలు 

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిని నూతన ప్రొబేషనరీ ఎస్ఐలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతపురం ట్రెయినింగ్ కళాశాలలో శిక్షణ ముగించుకుని ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం కేటాయించిన 35 మంది జిల్లాకు వచ్చారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని ఎస్పీ తెలిపారు. 35 మందికి వివిధ పోలీస్ స్టేషన్లను కేటాయించారు.

News March 9, 2025

మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం: ఎంపీ 

image

ఏలూరు నగరాన్ని మేజర్ సిటీగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు.

News March 9, 2025

రాజాం: వాల్ పిన్ మింగేసిన బాలుడు

image

ఏడాది వయసున్న బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. బాలుడు ఏడుస్తూ అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఓ హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న వాల్ పిన్ జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

error: Content is protected !!