News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
Similar News
News March 23, 2025
ప.గో: ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..కలెక్టర్

స్వచ్ఛఆంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ ఏడితో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ రోడ్లపై చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకూడదన్నారు.
News March 22, 2025
ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో ఇంటర్ యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద తీర్పుఇచ్చారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
News March 22, 2025
ఆధార్ నమోదు ప్రక్రియపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షించాలని, జిల్లాలో 10,748 వేల మంది పిల్లలు ఆధార్ నమోదు కాలేదని సత్వరమే ఆధార్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు