News February 28, 2025
భువనగిరి: జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా.. 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
Similar News
News February 28, 2025
చీపురుపల్లి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవే..!

➤ మార్చి 2న ఉదయం నేత్రోత్సవం, పాలధార ఉత్సవం, సాయంత్రం భామా కలాపం పేరిట భాగవతం ప్రదర్శన
➤ మార్చి 2న రాత్రి 7గంటలకు రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు
➤ 3న సాయంత్రం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం, ప్రముఖ సినీ గాయకులచే స్వరాభిషేకం, బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్
➤ 4న రాత్రి ఢీ డ్యాన్సర్లతో మెగా డాన్స్ హంగామా, 11 గంటలకు భారీ మందుగుండు ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం
News February 28, 2025
రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకాంబిక జాతర..!

అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబును ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని కార్యదర్శిని ఆదేశించినట్లు రామకృష్ణ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News February 28, 2025
గోదావరిలో గల్లంతైన యవకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు.జ వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు.