News February 4, 2025

భువనగిరి: తొలి రోజు 115 మంది డుమ్మా!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. జనరల్‌ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌‌కు 586 మందికి గాను 579 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు 1,564 మందికి గాను 1456 మంది హాజరుకాగా 108 మంది గైర్హాజరయ్యారు. ఈనెల 3 నుంచి 22 వరకు మూడు దఫాలుగా 2 పూటలా జరుగనున్న ప్రాక్టికల్స్‌కు జనరల్‌ ఇంటర్‌ సెకండ్ ఇయర్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు 6,200మంది హాజరు కావాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

మీరు గొప్పవారు సర్..

image

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.

News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

News March 14, 2025

బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

image

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

error: Content is protected !!