News February 3, 2025

భువనగిరి: నేడో, రేపో అధ్యక్షుడి పేరు ప్రకటన!

image

బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుదిదశకు చేరింది. నేడో, రేపో అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఊట్కూరి అశోక్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఇందులో ఒకరి పేరు ఖరారు చేసింది. జిల్లా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. పదవి బీసీకి కట్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News March 14, 2025

ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

image

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.

News March 14, 2025

పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్‌లు

image

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్‌లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్‌తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

News March 14, 2025

నా కెరీర్ ముగిసిందని అనుకున్నారు.. కానీ: విజయ్ సేతుపతి

image

తన కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ‘మహారాజ’ సినిమా తనను నిలబెట్టిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ అవార్డు కార్యకమంలో మాట్లాడుతూ ‘2-3 ఏళ్లు నా సినిమాలు బాగా ఆడలేదు. ఆ సమయంలో ‘మహారాజ’ వచ్చి నన్ను నిజంగానే ‘మహారాజ’ను చేసింది. దీనికి ఇంతలా ప్రశంసలు వస్తాయని ఊహించలేదు’ అని పేర్కొన్నారు. 2024లో రిలీజైన ఈ సినిమా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది.

error: Content is protected !!