News March 24, 2025
భువనగిరి: పది పరీక్షలకు 10 మంది డుమ్మా

భువనగిరి జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు DEO సత్యనారాయణ తెలిపారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్ష 50 పరీక్ష కేంద్రాల్లో జరగగా ఆయన 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. మొత్తం 8,618 విద్యార్థులకు 8,608 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News March 30, 2025
నెలవంక దర్శనం.. రేపే రంజాన్

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.
News March 30, 2025
విషాదం.. ఆరుగురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News March 30, 2025
విశాఖలో మ్యాచ్ చూసిన అనాథ చిన్నారులు

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు 65 మంది అనాథ చిన్నారులకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ అవకాశం కల్పించారు. వీరిలో భీమిలి ఎస్.ఓ.ఎస్ ఆర్గనైజేషన్ నుంచి 45 మంది, గాజువాకకు చెందిన డిజైర్ ఆర్గనైజేషన్ నుంచి 20 మందికి అవకాశం కల్పించారు. క్రికెట్ నేరుగా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. సీపీతో కలిసి వారు ఫొటోలు దిగారు.