News March 16, 2025

భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

image

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 16, 2025

సారవకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద పాతపట్నం నర్సంపేట హైవే రోడ్డుపై లారీ కారు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు. ఆదివారం పాతపట్నం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ, నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలో చనిపోయారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News March 16, 2025

NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

image

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.

News March 16, 2025

అల్లూరి: కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

10th తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 11,762 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

error: Content is protected !!