News February 6, 2025

భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.

Similar News

News February 7, 2025

కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు

image

కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

News February 7, 2025

ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

image

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News February 7, 2025

నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.

error: Content is protected !!