News March 28, 2025

భువనగిరి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

image

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ విద్యార్థులు పోస్టుమట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 3, 2025

కాసేపట్లో వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో కాసేపట్లో ఆ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరి మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.

News April 3, 2025

మంత్రివర్గంలో మైనార్టీలకి చోటు: టీపీసీసీ చీఫ్

image

TG: మంత్రి వర్గ విస్తరణ అనేది AICC పరిధిలోని అంశమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. క్యాబినెట్‌ విస్తరణలో మైనార్టీలకి అవకాశం కల్పిస్తామన్నారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని, HCU భూములని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లలో తమిళనాడు తరహాలోనే తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

News April 3, 2025

పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత

image

AP: YCP అధినేత జగన్‌పై MLA పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో CBI ఆయన్ను విచారించింది. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఓబుల్‌రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారు. ఆ సోదరుల మాటలు నమ్మి కుట్రలో భాగస్వామ్యం కావొద్దు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దు జగన్’ అని సునీత హెచ్చరించారు.

error: Content is protected !!