News February 25, 2025
భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

⏭ దామరచర్లలో దొంగ నోట్ల కలకలం ⏭ పీఏ పల్లిలో మహిళా దారుణ హత్య ⏭ వైద్య సిబ్బందిని బెదిరిస్తే కేసులు: ఎస్పీ శరత్ చంద్ర పవర్ ⏭ రిజిస్టర్ ఓటర్లకు సెలవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి ⏭ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ సుచరిత ⏭ శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ⏭ గుర్రంపోడు ఎమ్మార్వోని సస్పెండ్ చేసిన కలెక్టర్
News February 25, 2025
రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దు: జగ్గారెడ్డి

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాళ్ల మాటలు పట్టించుకోని పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవద్దన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం స్థానంలో ఉందని అందరూ ఓపిగ్గా ఉండాలని కోరారు.
News February 25, 2025
ప్రశాంత్ ‘బ్రహ్మరాక్షస్’ మూవీలో ప్రభాస్?

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస్’ మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.